'పెద్ది' వివాదంలోకి రత్నా పాఠక్ షా.. హీరోయిన్లపై పాత వ్యాఖ్యలు వైరల్!

  • 'పెద్ది'లో జాన్వీ కపూర్‌ను చూపించిన విధానంపై నెటిజన్లు ఆగ్రహం
  • నటీమణుల పాత్రల ఎంపిక, అంగీకారంపై నటి రత్నా పాఠక్ షా గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ 
  • కేవలం గ్లామర్ వస్తువుగా చూపించే పాత్రలను తిరస్కరించాలన్న రత్నా పాఠక్ 
  • గతంలో సిల్క్ స్మిత వంటి వారికి ఎంపిక చేసుకునే అవకాశాలు లేకపోవచ్చన్న సీనియర్ నటి
  • ప్రస్తుత తరం నటీమణులకు ఆ ప్రివిలేజ్ ఉందని గుర్తు చేసిన రత్నా  పాఠక్
  • ఈ వ్యాఖ్యలు 'పెద్ది' వివాదానికి సరిగ్గా సరిపోతాయంటున్న నెటిజన్లు  
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటించిన 'పెద్ది' (Peddi) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించినప్పటికీ.. హీరోయిన్ పాత్రను హైపర్‌సెక్సువలైజ్డ్ (లైంగిక వస్తువుగా) చూపించారనే వివాదం మాత్రం సద్దుమణగడం లేదు. సినిమాలో జాన్వీ కపూర్ ముఖాన్ని చూపించడానికి ముందే ఆమె శరీరాకృతిని క్లోజప్ కెమెరా యాంగిల్స్‌తో ఫోకస్ చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, చిత్ర పరిశ్రమలో మహిళలను అందచందాలు ప్రదర్శించే ఒక వస్తువుగా చూపించడంపై సీనియర్ నటి రత్నా పాఠక్ షా (Ratna Pathak Shah) గతంలో చేసిన సంచలన వ్యాఖ్యల వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

‘న్యూస్18’ నిర్వహించిన ఒక పాత ప్యానెల్ చర్చలో రత్నా పాఠక్ షాతో పాటు విద్యాబాలన్, భూమి పెడ్నేకర్, స్వర భాస్కర్, జైరా వసీం వంటి ప్రముఖ నటీమణులు పాల్గొన్నారు. ఆ చర్చలో రత్నా పాఠక్ షా మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ ఉండి, ఆర్థికంగా స్థిరపడిన నటీమణులు తమను కేవలం లైంగిక వస్తువులుగా చూపించే పాత్రలకు ‘నో’ చెప్పాలని పిలుపునిచ్చారు. "వెండితెరపై మనల్ని ఎలా చూపిస్తున్నారనే దానిపై మనం ఎందుకు గళం విప్పడం లేదు? గతంలో సిల్క్ స్మిత (Silk Smitha) వంటి నటీమణులకు కుటుంబ నేపథ్యం లేదా ఆర్థిక అవసరాల రీత్యా వేరే దారి లేక అలాంటి పాత్రలు చేసి ఉండవచ్చు. కానీ, ఈ రోజు ఇండస్ట్రీలో ఉన్న ప్రివిలేజ్డ్ (ఆర్థికంగా, కుటుంబపరంగా వెనుకడుగు వేయాల్సిన అవసరం లేని) నటీమణులు కూడా ఎందుకు రాజీపడుతున్నారు?" అని ఆమె ప్రశ్నించారు.

ప్రస్తుత వివాదానికి అద్దం పడుతున్న వ్యాఖ్యలు 
ఈ పాత వీడియో క్లిప్‌ను ఇప్పుడు 'పెద్ది' సినిమా వివాదంతో పోలుస్తూ నెటిజన్లు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. సినిమా పరిశ్రమలో ఎంతటి కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ.. కమర్షియల్ చిత్రాలలో దర్శకులు కేవలం మేల్ గేజ్ (పురుషుల దృక్కోణం)కు ప్రాధాన్యమిస్తూ హీరోయిన్ల పాత్రల ప్రాధాన్యతను తగ్గిస్తున్నారనడానికి జాన్వీ కపూర్ ఎదుర్కొంటున్న ఈ పరిస్థితే నిదర్శనమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. షూటింగ్ సమయంలోనే జాన్వీ కపూర్ కొన్ని కెమెరా యాంగిల్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిందని, రామ్ చరణ్ కూడా ఆమెకు మద్దతుగా నిలిచాడని కొన్ని చాట్స్ లీక్ అయిన నేపథ్యంలో ఈ వీడియో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. 

Ratna Pathak Shah
Peddi movie controversy
Janhvi Kapoor
Ram Charan
Male gaze in cinema
Actresses objectification
Telugu cinema news
Ratna Pathak Shah viral video
Peddi film row
Silk Smitha

More Telugu News